తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం

Fri,July 20, 2018 09:58 AM
first schedule completed

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ఆస‌క్తిక‌ర మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) మూవీ ఒక‌టి . విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఎఫ్‌2 చిత్రం రూపొందుతుంది. అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. రీసెంట్‌గా చిత్ర నిర్మాత‌లు ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ జోడి క‌ట్టింది. కొద్ది రోజులుగా రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు మాస్‌లుక్‌లో లుంగీతో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

1548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles