సల్లూ భాయ్ సడెన్ సర్ ప్రైజ్

Wed,April 19, 2017 01:16 PM
FIRST poster of Salman Khan tube light

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కబీర్‌ఖాన్ దర్శకత్వంలో ట్యూబ్ లైట్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భజరంగీభాయ్ జాన్, ఏక్తా టైగర్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. దీంతో ట్యూబ్ లైట్ మూవీపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో అభిమానులందరు చిత్ర టీజర్, ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర టీజర్ ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసి, మేలో ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టు ఇటీవల దర్శకుడు తెలిపాడు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ లుక్ ఒకటి విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు. బ్యాక్ లుక్ ని విడుదల చేసినప్పటికి ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. ఇక చిత్రాన్ని ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే. ట్యూబ్‌లైట్ మూవీని జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లడక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చిత్రీకరించారు. ఈ మూవీలో చైనీస్ హీరోయిన్ జూ జూ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది.
988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS