అనుష్క‌, కార్తికేయ మూవీల‌ ఫ‌స్ట్ లుక్ అప్‌డేట్స్

Fri,September 6, 2019 09:24 AM
first looks updates

భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న చిత్రం సైలెన్స్‌. తెలుగులో ఈ చిత్రం నిశ‌బ్ధం పేరుతో విడుద‌ల కానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చిత్ర ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 11 ఉద‌యం 11గం.11ని.ల‌కి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కార్తికేయ ఆ త‌ర్వాత హిప్పీ, గుణ 369 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చాయి. తాజాగా గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంతో విల‌న్‌గా న‌టించాడు కార్తికేయ‌. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. క‌ట్ చేస్తే కార్తికేయ ప్ర‌స్తుతం ఆర్ఎక్స్ 100 మేక‌ర్స్‌తో క‌లిసి ఓ మూవీ చేస్తున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ రూపొందించ‌నున్న ఈ చిత్రాన్ని శేఖ‌ర్ రెడ్డి ఎర్రా తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేస్తూ.. సెప్టెంబ‌ర్ 9న ఫ‌స్ట్ లుక్, టైటిల్ విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశారు. ప్రీ లుక్‌లో పాల బాటిల్‌లో మందు పోసి ఉండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles