96 రీమేక్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,January 31, 2019 11:16 AM
First Look Poster Of 96 Remake released

విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన త‌మిళ చిత్రం 96. ఫ్రెష్ కంటెంట్‌తో, న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ చిత్రం 2018లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ప‌లు భాష‌ల‌లో రీమేక్ అవుతుంది. 96 చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు ద‌క్కించుకోగా ఇందులో శ‌ర్వానంద్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇక కన్న‌డ‌లోను 96 చిత్రాన్ని రీమేక్ చేస్తుండ‌గా, 99 అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుంది. మ‌ల‌యాళ న‌టి భావ‌న త్రిష పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో గ‌ణేష్ కనిపించ‌నున్నాడు . రాము ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ క‌న్న‌డ వ‌ర్షెన్‌కి సంబంధించిన రైట్స్‌ని చేజిక్కించుకోగా, ప్రీత‌మ్ గుబ్బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. అయితే తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో గ‌ణేష్ .. విజ‌య్ సేతుప‌తి మాదిరిగా గ‌డ్డంతో క‌నిపిస్తున్నాడు. 99 చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సమ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట .2554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles