"మహానటి" కీర్తి ఫస్ట్ లుక్ విడుదల

Tue,October 17, 2017 11:32 AM

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషిస్తుంది. నేను శైలజ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కీర్తి ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతుంది. ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఆ మధ్య.. చిత్రంలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ లుక్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇది ఓ కమర్షియల్ యాడ్ కోసం చేసిందే తప్ప, సావిత్రి లుక్ కాదంటూ కీర్తి క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా మహానటి సెట్స్లో కీర్తి సురేష్, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేలకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్లో చక్కర్లు కొట్టింది. ఇందులో కీర్తి, షాలినిలని చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. అయితే ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే కావడంతో మేకర్స్ సావిత్రి లుక్ లో ఉన్న కీర్తి సురేష్ ఫోటోని అఫీషియల్ గా విడుదల చేశారు. ఇందులో కీర్తి అచ్చం సావిత్రి లుక్ లో ఉండడం విశేషం. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మహానటి చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని, మోహన్ బాబు, దుల్కర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది.


2987
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS