పెద్ద ప్ర‌మాదం నుండి తప్పించుకున్న షారూఖ్‌

Fri,November 30, 2018 10:08 AM

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ప్ర‌స్తుతం ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో జీరో అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో షారూఖ్‌ సరసన కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతుంది. అయితే ఓ పాట చిత్రీక‌ర‌ణ కోసం ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేయ‌గా అందులో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది . దీంతో ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌తో అలుముకుంది. స‌మాచారం అందుకున్న ఐదు ఫైర్ ఇంజిన్స్ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ని అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదంలో షూటింగ్‌కి సంబంధించిన పరిక‌రాలన్నీ ద‌గ్ధం కాగా, ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదు. షారూఖ్ ఖాన్ ప్ర‌మాద స‌మ‌యంలో అక్క‌డే ఉన్న‌ట్టు తెలుస్తుంది. షారూఖ్ నటించిన జీరో చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఇందులో షారూఖ్ మ‌రుగుజ్జు పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, కత్రినా సూపర్ స్టార్ పాత్ర పోషిస్తున్నారు . అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో క‌నిపించనున్నారు .

3019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles