భార్య అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో క‌ష్టాల్లో ప్ర‌ముఖ న‌టుడు

Thu,February 21, 2019 09:41 AM

భార్య అనుచిత ప్ర‌వ‌ర్త‌న పాకిస్థాన్ ప్ర‌ముఖ న‌టుడు ఫ‌వాద్ ఖాన్‌ని క‌ష్టాల‌లోకి నెట్టింది. వివ‌రాలోకి వెళితే పాకిస్థాన్‌లో పోలియో కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్న క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తుంది. ఈ క్ర‌మంలో ఫ‌వాద్ ఖాన్ ఇంటికి కూడా వెళ్ళారు. అయితే త‌మ కూతురికి పోలియా చుక్క‌లు అవ‌స‌రం లేద‌ని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ని అడ్డుకుంది ఫ‌వాద్ భార్య‌. అంతేకాదు వారితో కాస్త అనుచితంగా కూడా ప్ర‌వ‌ర్తించింద‌ట‌. దీంతో జిల్లా అధికారి ముహమ్మద్ జమీల్.. ఫ‌వాద్ ఖాన్‌పై కేసు పెట్టారు. అయితే ఆ స‌మ‌యంలో ఫ‌వాద్ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఈవెంట్‌ నిమిత్తం దుబాయ్‌లో ఉన్న‌ప్ప‌టికి ఆయ‌న‌తో పాటు భార్య‌పై కూడా కేసు న‌మోదు చేశార‌ట‌. అక్క‌డి చ‌ట్టాల ప్ర‌కారం వారికి రెండేళ్ళ జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పాకిస్తాన్‌కి చెందిన ఫ‌వాద్ బాలీవుడ్‌లో ఖూబ్‌సూరత్ అనే సిమా చేశాడు. ఇందులో హీరోగా ఫ‌వాద్ న‌టించ‌గా ఆయ‌న స‌ర‌స‌న సోన‌మ్ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది . యే దిల్‌ హై ముష్కిల్‌ వంటి పలు బాలీవుడ్‌ సినిమాల్లోను కీలక పాత్ర పోషించాడు.

7424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles