ట్రాఫిక్‌ ఉల్లంఘన.. రాంగోపాల్‌వర్మకు జరిమానా

Sat,July 20, 2019 07:23 PM
fined to Ramgopalvarma due to Traffic violation

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు పోలీసులు జరిమానా విధించారు. నగరంలోని ముసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌ వద్ద సహదర్శకులతో కలిసి వర్మ బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. అంతేకాకుండా ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. రాంగోపాల్‌వర్మ ట్రిపుల్‌ డ్రైవింగ్‌ వ్యవహారంపై స్పందించిన పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంపై జరిమానా విధించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కింద రూ.1350 జరిమానా విధించారు.

1509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles