హెల్మెట్ లేనందుకు న‌టుడికి వంద రూపాయ‌ల జ‌రిమానా

Tue,August 14, 2018 12:53 PM

స‌ల్మాన్ చెల్లెలి భ‌ర్త ఆయుశ్ శ‌ర్మ ల‌వ్‌రాత్రి అనే చిత్రంతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేస్తుండ‌గా, వ‌రీనా హుస్సేన్ ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అక్టోబ‌ర్ 5న చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేసారు. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ల‌వ్‌రాత్రి చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌లైంది. ఇందులో సన్నివేశాలు అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గుజ‌రాతీ సంప్ర‌దాయ గ‌ర్భ నృత్యం చేస్తున్న అమ్మాయిని చూసి హీరో మ‌న‌సు ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌వుతారు. అమ్మాయి ఇండియా వ‌దిలి విదేశాల‌కి వెళ్లిపోవ‌డంతో హీరో ఆమె ప్రేమ‌ని పొంద‌డానికి విదేశాల‌కి వెళ‌తాడు. అక్కడ ఆమెను, ఆమె తండ్రిని హీరో మెప్పిస్తాడా లేదా వారి ప్రేమకు ఎదురైన ఆటంకాలేమిటీ? చివరికి వారు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

అక్టోబ‌ర్ లో విడుద‌ల కానున్న సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయుష్‌, వ‌రీనా క‌లిసి గుజ‌రాత్‌లోని వ‌డోద‌రా ప్రాంతంలో బైక్‌పై చ‌క్క‌ర్లు కొట్టారు. ఆ స‌మ‌యంలో ఆయుష్ హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డంతో నెటిజ‌న్స్ ఆయుష్‌పై మండిప‌డ్డారు. విష‌యం పోలీసుల వ‌ర‌కు చేర‌డంతో వడోదరాలో హీరో, హీరోయిన్స్ నివసిస్తున్న హోటల్‌కు వెళ్లి పోలీసులు మెమోలు జారీ చేశారు. సెల‌బ్రిటీలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌ల‌లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని అందుకోస‌మే రూ.100 జరిమానా విధించి మెమోలు జారీ చేశాం’ అని వడోదరా ఏసీపీ అమితా వనాని తెలిపారు. గతంలో బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, కునాల్‌ ఖేములకు కూడా ముంబయి పోలీసులు ఇలానే చలాన్‌ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

6716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles