వంద రోజుల‌ ప్రయాణాన్ని షార్ట్ అండ్ స్వీట్‌గా చూపించిన బిగ్ బాస్

Thu,October 31, 2019 08:12 AM

వంద రోజులు ప్ర‌పంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో ఉండ‌డం సామాన్యుల‌కి కూడా సాధ్యం కాదు. అలాంటిది ఎంతో విలాస‌వంతంగా బ్ర‌తికే సెల‌బ్రిటీలు బిగ్ బాస్ ట్రోఫీని గెల‌వాల‌నే సంక‌ల్పంతో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ని ఎదుర్కొంటూ ముందుకు ప్ర‌యాణించారు. 102 రోజుల బిగ్ బాస్ ప్ర‌యాణాన్ని బాబా భాస్క‌ర్, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్, శ్రీముఖి, వ‌రుణ్ సందేశ్‌లు పూర్తి చేశారు. ఇంత గొప్ప అచీవ్‌మెంట్ సాధించిన ఈ ఐదుగురి బిగ్ బాస్ జ‌ర్నీలో ఎన్నో కోపాలు, ఆవేశాలు,ప్రేమ‌లు, ఎమోష‌న్స్ ఉన్నాయి. వీట‌న్నింటిని స్మాల్ స్క్రీన్‌పై చూపించి ఇంటి స‌భ్యులు భావోద్వేగానికి గుర‌య్యేలా చేశారు బిగ్ బాస్.


ముందుగా వరుణ్ సందేశ్‌ని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ అతని గురించి మాట్లాడారు. ‘మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. మీరు హౌస్‌లో చాలా బాధ్యతగా వ్యవహరించారు. భార్య‌తో వ‌చ్చిన‌ప్ప‌టికి గేమ్‌ని మాత్రం గేమ్‌లానే ఆడారు. మీ ప్ర‌యాణంలో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. వాటిని చూసి ఆస్వాదించండి అని బిగ్ బాస్ వీడియో ప్లే చేశారు. ఇది చూసిన వ‌రుణ్ కాస్త భావోద్వేగానికి లోన‌య్యాడు.

ఇక త‌ర్వాత వ‌చ్చిన రాహుల్‌లో త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ, ఆయ‌న ఓపిక‌, స‌హ‌నం గురించి చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. ఇంటి స‌భ్యుల నుండి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న మీరు చాలా సార్లు నామినేష‌న్ ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు మిమ్న‌ల్ని సేవ్ చేసి ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చారు. మీరు మీ ప్రదర్శనతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు. వెనుతిరిగి చూసుకోలేదు. మీ ప్రదర్శనతో ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. బిగ్ బాస్ మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నారు అని రాహుల్ జ‌ర్నీకి సంబంధించిన వీడియో ప్లే చేశారు

త‌ర్వాత బాబా భాస్క‌ర్ యాక్టివిటీ ఏరియాలోకి రాగా, బాబా భాస్క‌ర్‌ని ఆకాశానికి ఎత్తేశారు బిగ్ బాస్. డ్యాన్స‌ర్‌గా, కుక్‌గా, చిన్న‌పిల్లాడిలా మీరు పంచిన వినోదం చాలా నచ్చింది. బిగ్ బాస్‌ని గురువు గారు అని పిలిచి మా మ‌న‌సు గెలుచుకున్నారు. పెద్ద మ‌నిషి త‌ర‌హాలో ఇంటి స‌భ్యుల బాగోగులు చూసుకుంటూ వ‌చ్చిన మీరు జీవితంలో ఎంతో సాధించాల‌ని కోరుకుంటున్నాం అని బిగ్ బాస్ తెలిపారు . అనంత‌రం బాబా భాస్క‌ర్ జ‌ర్నీకి సంబంధించిన వీడియో ప్లే చేయ‌గా, ఆ వీడియోని చూసిన బాబా భాస్క‌ర్ ముందుగా ఫుల్ ఎంజాయ్ చేశారు.

త‌రువాత త‌రువాత అందులోని ఎమోష‌న్స్, లవ్‌, సీరియ‌స్ బాబా భాస్క‌ర్ కంట క‌న్నీరు ఆగ‌కుండా చేశాయి.మీ భావాల‌ని మాతో షేర్ చేసుకోవ‌చ్చు అని బిగ్ బాస్ చెప్ప‌గా, బాబా మాత్రం ఏడుస్తూనే ఉన్నారు. నేను చాలా సెన్సిటివ్‌. యాక్టింగ్ రాదు అని చాలా ఎమోష‌నల్ అయ్యారు బాబా. నేడు శ్రీముఖి, అలీ రెజాల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ప్ర‌సారం కానుంది.

2836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles