లాల్ క‌ప్తాన్ నుండి ఫైన‌ల్ ట్రైల‌ర్ అవుట్..!

Wed,October 2, 2019 10:39 AM

సైఫ్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో నవ‌దీప్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం ‘లాల్ కప్తాన్’ . పీరియాడిక్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో సైఫ్ నాగ సాధు గెటప్‌లో కనిపించనున్నారు. 18వ శతాబ్దంలో ఓ బ్రిటీష్‌ కెప్టెన్‌పై పోరాడిన నాగసాధువు కథ ఆధారంగా చిత్రం రూపొందుతుంది. ఇలాంటి పాత్రలో సైఫ్ నటించడం ఇదే తొలిసారి కాబట్టి ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు . అక్టోబర్ 18న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి చాప్ట‌ర్ 1,2 పేరుతో ప‌లు ట్రైల‌ర్స్ విడుద‌ల చేయ‌గా, తాజాగా మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నాయి. తెల్ల వాళ్ళ‌తో సైఫ్ పోరాడే తీరు ఆక‌ట్టుకుంటుంది. చిత్రంలో సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో కనిపించనున్నారు. మానవ్ విజ్, జోయా హుస్సేన్, దీపిక్ డోబ్రియల్, సిమోన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, సైఫ్.. ‘తానాజీ ది అన్‌సంగ్ హీరో’, ‘దిల్ బిచారా’, ‘జవానీ జానేమన్’ అనే డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు.

471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles