మ్యూజిక్ డైరెక్టర్ పై కోర్టుకెక్కిన నిర్మాతలు

Sun,December 23, 2018 07:32 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో సినీ నిర్మాతలు కోర్టుకెక్కారు. తాను కంపోజ్ చేసిన సినిమా పాటలకు కాపీరైట్స్ తనకే చెందుతాయని ఇళయరాజా చెప్తున్న నేపథ్యంలో..నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టులో సివిల్ కేసు వేశారు. పాటలతోపాటు సినిమాకు సంబంధించిన అన్నీ హక్కులు నిర్మాతలకే ఉంటాయని..సదరు నిర్మాతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్ చంద్రశేఖర్, పీటీ సెల్వ కుమార్‌తోపాటు మరో నలుగురు నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. నిర్మాతలు తీసిన సినిమాల్లో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలపై ఆయనకు ఎలాంటి యాజమాన్య హక్కులుండవని నిర్మాతలు పేర్కొంటున్నారు. సినిమాలోని ఆడియో, వీడియో, పాటలు ఇతర అంశాలపై కాపీరైట్ హక్కులు నిర్మాతలకే ఉంటుందని అంటున్నారు.

‘కొన్నేళ్లుగా ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని వాదిస్తున్నారు. 80 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఏ సాంకేతిక పనులైనా ఒక్క వ్యక్తితో మ్యూజిషియన్లు, కళాకారులు, టెక్నీషియన్లు, నటుల సమన్వయంతో జరుగుతాయి. ఇళయరాజాకు యాజమాన్య హక్కుల విషయంలో ఉపశమనం కల్పిస్తే..ఇక నుంచి సినిమాకు పనిచేసిన దర్శకుడు, హీరో, కమెడియన్, ఇతర నటీనటులు కూడా కాపీరైట్ హక్కులు మాకు కూడా ఉంటాయని వాదిస్తారని’ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. సినిమాపై పూర్తి కాపీరైట్ హక్కులు నిర్మాతలకే చెందుతాయని సంకేతాలిస్తూ నిర్ధిష్ట ఆదేశాలు జారీచేయాలని నిర్మాతలు కోర్టును విజ్ఞప్తి చేశారు.

3488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles