కౌశ‌ల్‌, తనీష్ వ‌ల‌న టాస్క్ రద్ధు చేసిన బిగ్ బాస్

Wed,September 19, 2018 08:59 AM
Fight for the Finale Ticket in bigg boss house

బిగ్ బాస్ సీజ‌న్2 తుది ద‌శ‌కి చేరుకున్న క్ర‌మంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు మ‌రింత క‌ఠినంగా ఉంటున్నాయి. వంద‌వ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు అంద‌రు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నార‌ని బిగ్ బాస్ హెచ్చరించిన నేప‌థ్యంలో కంటెస్టెంట్‌ల మ‌ధ్య‌ పెద్ద వివాదం చెల‌రేగింది. ముఖ్యంగా కౌశ‌ల్‌ని టార్గెట్ చేస్తూ మిగ‌తా కంటెస్టెంట్స్ మూకుమ్మ‌డి దాడి చేశారు. 101వ ఎపిసోడ్‌లోను ఇదే కొన‌సాగింది. ‘మీ ఇసుక జాగ్రత్త’ అనే ఫిజికల్ టాస్క్ లో త‌నీష్‌, కౌశ‌ల్‌లు శారీర‌క హింస‌కి పాల్ప‌డిన‌ నేప‌థ్యంలో బిగ్ బాస్ వారిద్ద‌రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత లివింగ్ రూంలో కూర్చున్న కౌశల్‌తో రిలేష‌న్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఫైట్‌కి దిగారు మిగతా ఇంటి స‌భ్యులు.

బిగ్ బాస్ 101వ ఎపిసోడ్‌లో ‘మీ ఇసుక జాగ్రత్త’ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో గెలుపొందిన విజేతకు ఈ వారం ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు.. డైరెక్ట్‌ ఫినాలేకి వెళ్లే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. ఈ టాస్క్ 2 లెవల్స్‌లో ఉంటుంది. మొదటి లెవల్‌లో కౌశల్, గీతా, రోల్ రైడాలు ఇసుక కంటైన‌ర్‌లో ఉన్న‌ ఇసుకను కాపాడుకుంటూ ఉండాలి. మిగిలిన వాళ్లు ఆ ఇసుకుని తొలగించే ప్రయత్నం చేయాలి. కింద పడిన ఇసుకను తీసి మ‌ళ్ళీ కంటైన‌ర్‌లో వేసుకోవ‌చ్చు. అలాగే తమ ఇసుకను కాపాడుకుంటూనే మిగిలిన వాళ్ల ఇసుకును కింద పడేయొచ్చు. ఈ ‘మీ ఇసుక జాగ్రత్త’ లెవల్ 1లో కౌశల్, గీతా, రోల్ రైడా ఇసుకను కాపాడుకుంటే.. దీప్తి, తనీష్, సామ్రాట్‌లు ఆ ఇసుకను కిందకు పడేసే ప్రయత్నం చేశారు.

గీతా కంటైన‌ర్‌ని దీప్తి ప‌డేసే ప్ర‌య‌త్నం చేయ‌గా, కౌశ‌ల్ కంటైన‌ర్‌ని సామ్రాట్‌, త‌నీష్‌లు ప‌డేశారు. ఇక రోల్ కంటైన‌ర్‌ని కౌశ‌ల్ ప‌డేయ‌గా.. సామ్రాట్‌, త‌నీష్‌లు రోల్‌కి కొంత‌వ‌ర‌కు మ‌ద్దతుగా నిలిచారు. ఈ టాస్క్‌లోను కౌశల్‌నే టార్గెట్ చేస్తూ గేమ్ న‌డ‌వ‌గా టాస్క్‌లో త‌నీష్‌, కౌశ‌ల్‌లు నెట్టుకోవ‌డం, తోసుకోవ‌డం లాంటివి చేసారు. అంతేకాదు కంటైన‌ర్ రాడ్స్ విర‌గ్గొట్ట‌డంతో పాటు గ్లాస్‌ని ప‌గ‌ల‌గొట్టారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఎన్నిసార్లు హెచ్చరించినా కౌశల్, తనీష్‌లు శారీరక హింసకు పాల్పడుతున్నారంటూ బిగ్ బాస్ హెచ్చరించారు. ఈ స‌మ‌యంలో మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కి పంపించ‌వచ్చు. కాని మీకు చివ‌రి అవ‌కాశం ఇస్తున్నామంటూ బిగ్ బాస్ అన్నారు. అంతేకాదు టాస్క్‌లో హింస‌కి దిగ‌డంతో మ‌ధ్య‌లోనే టాస్క్‌ని ర‌ద్దు చేసిన బిగ్ బాస్ ఎవ‌రి కంటైన‌ర్‌లో ఎక్కువ ఇసుక ఉందో చూడమ‌ని సామ్రాట్‌కి చెబుతారు.

రోల్ రైడా కంటైన‌ర్‌లో ఎక్కువ ఇసుక ఉంద‌ని సామ్రాట్ బిగ్ బాస్‌కి చెప్ప‌డంతో రోల్‌ని రేస్ 2 టు ఫినాలే లో లెవ‌ల్ 2 కి వెళ్లిన మొద‌టి పోటీ దారుడిగా బిగ్ బాస్ ప్ర‌క‌టించి ఆయ‌న‌ని అభినందించారు . ఇక ఆ త‌ర్వాత కౌశ‌ల్ గేమ్ గురించి, ఆయ‌న మాట్లాడే మాట‌ల‌పై కొద్ది సేపు చ‌ర్చ జ‌రిపారు ఇంటి స‌భ్యులు. ఇక నేటి ఎపిసోడ్‌లోను ఇంత‌కు మించిన కోట్లాట‌ఉంటుంద‌ని బిగ్ బాస్ వ‌దిలిన ప్రోమోని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఒక్క మాట మాట్లాడితే అంద‌రు నా మీద‌కి ఎగ‌బ‌డ‌తార‌ని కౌశ‌ల్ అన‌డంతో సామ్రాట్‌, త‌నీష్‌, రోల్ రైడాలు ఒక్క‌సారిగా ఆయ‌న మీద‌కి దూసుకు రావ‌డం చూపించారు. రోల్ క‌న్నీటి పర్యంతం అయిన‌ట్టు కూడా ప్రోమోలో క‌నిపించింది. మ‌రి నేటి ఎపిసోడ్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగిందో తెలుసుకోవాలంటే కొన్ని గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

4831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles