అక్ష‌రాలా..ఐదోసారి!

Tue,November 20, 2018 08:23 AM
fifth time shiva, ajith combination comes on to the screen

త‌మిళ స్టార్ హీరో అజిత్ స్టైలే వేరు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం విశ్వాసం అనే టైటిల్‌తో శివ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేస్తున్న అజిత్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని కూడా శివ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్న‌ట్టు కోలీవుడ్‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టికే అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో వీర‌మ్‌, వేదాళ‌మ్‌, వివేగ‌మ్ వంటి చిత్రాలు రాగా, విశ్వాసం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగు చిత్రాల టైటిల్స్ వి లెట‌ర్‌తో ఉండ‌డం విశేషం. ఒక వేళ ఐదో సినిమా పట్టాలెక్కితే ఆ చిత్రానికి కూడా వి అనే లెట‌ర్‌తో టైటిల్ ఉండేలా చూసుకుంటారేమో. అజిత్ న‌టిస్తున్న విశ్వాసం చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీలో అజిత్ డాన్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS