రెమ్యూన‌రేషన్ పెంచేసిన 'ఫిదా' గ‌ర్ల్?

Sun,August 13, 2017 04:00 PM
Fidaa Girl Sai Pallavi doubled her remuneration, says film industry

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన అమ్మాయి సాయి ప‌ల్ల‌వి. కేర‌ళ కు చెందిన అమ్మాయయినా... తెలంగాణ భాష‌ను ఒడిసి ప‌ట్టుకొని... న‌ట‌న‌లో జీవించింది. అందుకే త‌న‌కు ఫిదా సినిమాలో నూటి నూరు మార్కులు ప‌డ్డాయి. ఒక్క సినిమా తోనే ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ మ‌ల‌యాళి సుంద‌రి. ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది ప‌ల్ల‌వి. దీంతో త‌న పారితోష‌కాన్ని అమాంతం పెంచేసింద‌ట‌. సాయి ప‌ల్ల‌వి ఫిదా సినిమా లో న‌ట‌న చూసి ముగ్ధులైన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు సాయి ప‌ల్ల‌వితో సినిమా చేయ‌డానికి క్యూ క‌డుతున్నార‌ట‌. త‌న‌కు ఒక్క‌సారిగా ఇంత డిమాండ్ రావ‌డంతో త‌న రెమ్యూన‌రేష‌న్ ను డ‌బుల్ చేసేసింద‌ట‌. అయితే.. త‌ను ఎంత పారితోష‌కం అడిగినా ఇవ్వ‌డానికి బ‌డా బ‌డా నిర్మాత‌లు కూడా రెడీగా ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతానికి సాయి ప‌ల్ల‌వి నానితో ఎంసీఏ మూవీలో న‌టిస్తున్న‌ది. ఒక్క తెలుగు ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు.. కోలీవుడ్ నుంచి కూడా ప‌ల్ల‌వి కి బంప‌ర్ ఆఫ‌ర్లే వ‌స్తున్నాయ‌ట‌. ల‌క్కంటే సాయి ప‌ల్ల‌విదే. ఒక్క సినిమా తో సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకున్న‌ది.

5510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles