జోదా అక్బ‌ర్ సెట్స్‌లో మ‌ణికర్ణిక చిత్రీక‌ర‌ణ‌

Fri,November 16, 2018 08:39 AM
Few Scenes From Manikarnika Were Shot On The Sets Of jodha akbar

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ జ‌రుగుతుంది . వీటికి కంగ‌నా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. హృతిక్ రోష‌న్ న‌టించిన జోదా అక్బ‌ర్ చిత్ర సెట్స్‌లో మ‌ణికర్ణిక మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని కంగ‌నా తెర‌కెక్కిస్తుందట‌. జోదా అక్బ‌ర్ కూడా చారిత్రాత్మ‌క చిత్రం కావ‌డంతో ఆ సెట్‌ని మ‌ణిక‌ర్ణిక నిర్మాత‌లు వాడుకుంటున్నార‌ట‌.

అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో పదునైన కత్తులతో శత్రువులపై ఝాన్సీ పోరాడే తీరు ఎలా ఉంటుందో కంగన చక్కగా పలికించిందంటున్నారు ఆమె అభిమానులు. క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించే ధీర వ‌నిత పాత్ర‌ని కంగానా పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. మ‌ణికర్ణిక చిత్రానికి పోటీగా హృతిక్ సూప‌ర్ 30 కూడా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. రెండు చిత్రాల‌పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌గా, ఏ మూవీ భారీ విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

1281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles