వైర‌ల్‌గా మారిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఫ్యామిలీ ఫోటో

Wed,October 23, 2019 12:19 PM

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులలో ఫాజిల్ ఒకరు. అతను మలయాళంలో కొన్ని ఉత్తమ చిత్రాలను రూపొందించాడు. వాటిలో చాలా వ‌ర‌కు బ్లాక్ బస్టర్స్. కొన్నాళ్ళుగా సినిమాల‌కి దూరంగా ఉంటున్న ఫాజిల్ వార‌స‌త్వాన్ని ఆయ‌న కుమారులు కొన‌సాగిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఫాహద్ ఫాసిల్ , అప్‌క‌మింగ్ యాక్ట‌ర్ ఫర్హాన్ ఫాజిల్ ప్ర‌స్తుతం తమ తండ్రి వారసత్వాన్ని కొన‌సాగిస్తున్నారు. అలానే నటి నజ్రియా నజీమ్ ఆ ఇంటి కోడ‌లిగా వెళ్ల‌డంతో ఆ ఫ్యామిలీ మొత్తం సినిమా కుటుంబంగా మారింది. ఇటీవల ఫాజిల్‌ అతని భార్య, కుమారులు, కుమార్తెలు మరియు వారి జీవిత భాగస్వాములతో క‌లిసి గ్రూప్ ఫోటో దిగారు. చాలా ఏళ్ల త‌ర్వాత అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఆ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

2230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles