వీర‌నారిలా బాణం సంధిస్తున్న దంగ‌ల్ భామ‌

Wed,September 19, 2018 01:43 PM
Fatima Sana Shaikh look revealed

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌, మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్. విజయ్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటిస్తున్నారు. కల్నల్ ఫిలిప్ మెడోవ్స్ 1983లో రాసిన కన్ఫేషియన్స్ ఆఫ్ ఎ థగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యచోప్రా అత్యంత భారీ స్థాయిలో చిత్రం రూపొందుతుంది. న‌వంబ‌ర్ 8న విడ‌ద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. మంగళవారం ఈ చిత్రంలోని అమితాబ్‌బచ్చన్ లుక్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కమాండర్ ఖుదాబక్ష్ పాత్రలో కనిపించారు. తాజాగా దంగ‌ల్ భామ ఫాతిమా సనా షేక్‌కు సంబంధించిన లుక్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు అమీర్‌. జాఫీరాగా కనిపించనుంది ఫాతిమా. రౌద్ర రూపంలో.. వీరనారిలా బాణం సంధిస్తూ ... యుద్ధానికి సిద్ధం అనేలా ఉంది ఫాతిమా లుక్. 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం సైరట్‌కు సంగీతం అందించిన అజయ్-అతుల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

2205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS