నాన్న కోలుకుంటున్నారు: శృతిహాసన్

Thu,July 14, 2016 06:24 PM
Father recovering well says Shruti Haasan


చెన్నై: కాలుకి గాయమై చికిత్స చేయించుకున్న నాన్న ప్రస్తుతం కోలుకుంటున్నారని నటి, కమల్‌హాసన్ కూతురు శృతిహాసన్ వెల్లడించారు. నాన్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నాన్న ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలను పంపిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు శృతి.

చెన్నైలోని తన ఆఫీసులో కిందపడిపోవడంతో కమల్‌హాసన్ కాలుకి గాయమైన విషయం తెలిసిందే. కమల్ హాసన్, శృతిహాసన్ లు ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు.


2806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles