కలర్ ఫుల్ డ్రెస్ లలో మెరిసిన బాలీవుడ్ భామలు

Fri,January 12, 2018 04:20 PM
Fashionistas of Bollywood

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భామలు కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో తళుక్కుమంటూ యూత్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. కుర్ర భామలే కాదు సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ని ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పర్ ఫెక్ట్ డ్రెస్ లలో ఈ అందాల భామలు పలు ఈవెంట్స్ లో సందడి చేస్తుంటే ఆ చుట్టు పక్కల వారు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. తాజాగా పలువురు బాలీవుడ్ భామలు పలు సందర్భాలలో వెరైటీ డ్రస్సెస్ ధరించి అందరి అటెన్షన్ ని తమ వైపుకి తిప్పుకున్నారు.

1. దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ కి హాజరైన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బ్లూ కలర్ డ్రెస్ లో తళుక్కుమంది. ఎలాంటి జ్యూయలరీ లేకుండా సింపుల్ గా చేతికి ఓ వాచి ధరించి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది ఐష్. ఇక బెంగళూర్ లో జరిగిన మరో ఈవెంట్ లో ఐష్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఓ డ్రెస్ ధరించి వా.. అనిపించింది


2. బాలీవుడ్ సెలబ్రిటీలకి మోస్ట్ లవబుల్ డిజైనర్ మనీష్ మల్హొత్రా. తాజాగా ఈయన డిజైన చేసిన దుస్తులని ధరించి దుబాయ్ ఈవెంట్ లో సందడి చేశారు బాలీవుడ్ భామలు. శ్రీదేవి, మహీరా ఖాన్, మౌరా హొకేన్ లు మనీష్ మల్హొత్రా కలిసి ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోని మనీష్ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశాడు.


3. బెబో కరీనా కపూర్ గ్లామర్ షోకి అంతే లేదు. ఈ మధ్య పలు మ్యాగజైన్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్ చేసిన కరీనా, తాజాగా సోహా అలీఖాన్ బుక్ లాంచింగ్ రెడ్ డ్రెస్ తో తళుక్కుమంది.4. బాలీవుడ్ భామ కాజోల్ ఢిల్లీలోని ఓ ఈవెంట్ కి వెళుతూ , ఫొటో షూట్ ఇచ్చింది. ఆ ఫోటోలని కాజోల్ తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి


5. ట్రెడిషనల్ డ్రెస్ లో శ్రీదేవి అభిమానుల మనసులని దోచుకుంది. ఇండియన్ పనోరమా సెక్షన్ ఇనాగ్యురేషన్ కి గోవా వెళ్ళిన శ్రీదేవి బ్లాక్ ఎతినిక్ అసెంబుల్ డ్రెస్ లో మెరిసింది.


ఇక మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, అతియా శెట్టి, నూర్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, కరీష్మా కపూర్,బిపాషా బసు, నిమ్రత్ కౌర్, కంగనా రనౌత్, దీపిక , అలియా భట్ , ప్రియాంక చోప్రాలు పలు సందర్భాలలో వెరైటీ డ్రెస్ లో తళుక్కుమన్నారు.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles