'కాలా' ఫ్యాన్స్ షో బుకింగ్స్ ఓపెన్

Tue,April 10, 2018 11:53 AM
fans show for kaala

కొద్ది రోజులుగా త‌మిళ నాడులో బంద్ కార‌ణంగా త‌మిళ సినిమాలేవి విడుద‌ల కావ‌డం లేద‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ కూడా జ‌ర‌గ‌డం లేదు. డిజిట‌లైజేష‌న్‌కి వ్య‌తిరేఖంగా టీఎఫ్‌పీసీ స్ట్రైక్ చేస్తుంది. కొద్ది రోజుల‌లో స్ట్రైక్ విరమిస్తార‌ని స‌మాచారం. స్ట్రైక్ తర్వాత ముందుగా సెన్సార్ జ‌రుపుకున్న సినిమాలు విడుద‌ల అవుతాయ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో కాలా సినిమా విడుద‌ల‌కి చాలా టైం ప‌ట్టొచ్చని అభిమానులు భావించారు. దీనిపై లైకా సంస్థ క్లారిటీ ఇస్తూ ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏప్రిల్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాకి ఫ్యాన్స్ షో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఆ రోజు ఉద‌యం 8గం.ల‌కి కేర‌ళ‌లోని త‌ల‌యోల‌ప‌రంబు ప్రాంతంలో తొలి షో ప్ర‌ద‌ర్శితం కానుండ‌గా అభిమానులు ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు. క‌బాలి త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టించిన ఈ చిత్రంపై అభిమానుల‌లో చాలా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కిన కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. సంతోష్ నారాయణన్‌ సినిమాకు బాణీలు అందించారు.

2494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles