అభిమాన హీరోల‌తో సాహో బ్యాంగ్ వీడియోస్

Wed,September 11, 2019 10:22 AM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో చిత్రం ఇటీవ‌ల విడుద‌లై దాదాపు 400 కోట్ల వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 1న చిత్ర మేక‌ర్స్ సాహో హై ఓల్టేజ్ యాక్ష‌న్ అంటూ ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఇందులోని స్టంట్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే కొంద‌రు ఔత్సాహికులు త‌మ అభిమాన హీరోల యాక్ష‌న్ స‌న్నివేశాల‌కి సాహో బీజీఎం జ‌త చేసి స్పెష‌ల్ వీడియోలు రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి . సాహో చిత్రం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా నటించిన ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌, లాల్‌, చుకీ పాండే, మందిరా బేడీ త‌దిత‌ర న‌టులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మీరు ఈ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.1633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles