వినూత్న రీతిలో నిర‌స‌న తెలుపుతున్న విజ‌య్ ఫ్యాన్స్

Sun,November 11, 2018 10:55 AM
Fans Burn, Smash Freebies Over Dropped Scenes

విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌ర్కార్. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. అయితే ఇందులో ఉచిత మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాన్‌ను పగలగొట్టే సన్నివేశాలు ఉండ‌గా, ఇవి పాల‌క పార్టీ మ‌నోబావాలు దెబ్బతీసేలా ఉన్నాయ‌ని అన్నాడీంఎకే వ‌ర్గాలు ఆందోళ‌న చేశాయి. అంతేకాదు సర్కార్ మూవీ థియేట‌ర్స్‌పై దాడి చేయ‌డ‌మే కాక‌, పోస్ట‌ర్స్ కూడా చించేశారు. దీంతో విజ‌య్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ‘సపోర్ట్‌ విజయ్‌’ హ్యాష్‌టాగ్‌తో త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు అభిమానులు త‌మ ఇంట్లో ఉన్న ఉచిత మిక్సీ, గ్రైండర్లను పగలగొడుతూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు . కొంద‌రు మంట‌ల‌లో వ‌స్తువులు వేసి కాలుస్తున్నారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొంద‌రు ఇలా చేయ‌డం స‌రికాదు అంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం సినిమాల‌ని రాజ‌కీయ కోణంలో అస్స‌లు చూడొద్దంటూ హితవు ప‌లుకుతున్నారు . ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో విజ‌య్ అభిమానుల వినూత్న నిర‌స‌న ఎంత వ‌ర‌కు వెళుతుందా అని త‌మిళ తంబీలు ముచ్చ‌టించుకుంటున్నారు. విజ‌య్ గ‌త చిత్రం మెర్స‌ల్ కూడా అనేక వివాదాల‌లో న‌లిగిన సంగ‌తి తెలిసిందే.2732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles