లండ‌న్‌లోను ధ‌నుష్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా ?

Sat,September 21, 2019 09:02 AM

సూప‌ర్ ర‌జ‌నీకాంత్ అల్లుడిగా కాకుండా మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ఎంద‌రో అభిమానుల ఆద‌ర‌ణ పొందాడు ధ‌నుష్‌. న‌టుడిగా, నిర్మాత‌గా, సింగ‌ర్‌గా ఇలా ప‌లు రంగాల‌లో రాణిస్తున్నారు ధ‌నుష్‌. ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు . ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జ‌రుగుతుంది. ధ‌నుష్ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుసుకున్నఅభిమానులు ఆయ‌న‌ని చూసేందుకు లొకేష‌న్‌కి వ‌చ్చారు. వారిని చూసి తెగ సంతోషించిన ధ‌నుష్ అంద‌రితో క‌ర‌చాల‌నం చేశారు. కొంద‌రితో సెల్ఫీలు దిగారు. లండ‌న్ అభిమానులు చూపించిన ప్రేమ‌కి ధ‌నుష్ ముగ్దుడ‌య్యాడు. ధ‌నుష్ తాజా చిత్రానికి ఎంజీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఉల‌గం సుత్రుం వ‌లిబ‌న్ అనే టైటిల్‌ని వాడాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ, జోజు జార్జ్‌, జేమ్స్ కాస్మో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న గ్యాంగ్‌స్ట‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు. ధ‌నుష్ త్వ‌ర‌లో అసురన్ చిత్రంతో ప్రేక్ష‌కులని ప‌ల‌కరించ‌నున్నాడు.




1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles