సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకురాలు కన్నుమూత

Fri,August 31, 2018 07:15 AM
famous tollywood director b jaya died with heart attack

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. టాలీవుడ్ దర్శకురాలు బీ జయ కన్నుమూశారు. ఆమెకు 54 ఏండ్లు. గత రాత్రి 11 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో జయ నివాసం ఉంటున్నారు. 2003 లో చంటిగాడు అనే సినిమాకు జయ దర్శకత్వం వహించారు. దాని తర్వాత ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి చిత్రాలకు జయ దర్శకత్వం వహించారు. జయ జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సినీ వారపత్రికను జయ నడిపిస్తున్నారు. దర్శకురాలు, జర్నలిస్ట్‌గానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిటింగ్ చేసుకునేవారు జయ. పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జయ ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్‌వో బీఏ రాజు భార్య. ఆమె తన భర్తతో కలిసి పలు చిత్రాలను కూడా నిర్మించారు. సినీ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న దర్శకురాలిగా జయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు జయ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ జయ మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బీఏ రాజు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. జయ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.


12355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles