‘ఫలక్‌నుమా దాస్‌’ ట్రైలర్ విడుద‌ల‌

Mon,May 13, 2019 03:29 PM
Falaknuma Das Official Trailer Telugu

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో సైకో వివేక్ పాత్రలో నటించిన విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. టైటిల్ పాత్రలో నటిస్తూనే.. ఈ చిత్రానికి విశ్వక్ దర్శకత్వం వహించడం విశేషం. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో జరిగే కథతో రూపొందించిన మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేశ్ ఇవాళ విడుదల చేశారు. ఈ చిత్రానికి వివేక సాగర్ సంగీతం అందించారు. కరాటే రాజు సమర్పణలో వన్మయే క్రియేషన్స్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి చారులింగ, ఉత్తేజ్ కీలక పాత్రలో నటించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్టీ సైదులు పాత్రలో నటించారు. ఫలక్‌నుమాలో ఆయన ఏమనుకుంటే అదైతది.. మనం కూడా అన్నలాగా గ్యాంగ్ పెడదామా అని ఇద్దరు పిల్లలు చెప్తుండగా ట్రైలర్ మొద‌ల‌వుతోంది.

1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles