నేను క్షేమంగానే ఉన్నా, ఆందోళ‌న చెందొద్దు: సునీల్

Sat,March 16, 2019 08:24 AM
fake news spread on sunil road accident

కొన్ని వెబ్‌సైట్స్ విష‌యం తెలుసుకోకుండా త‌ప్పుడు వార్త‌లు రాస్తుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతులకి గుర‌వుతున్నారు. గ‌తంలో కొంద‌రు సెల‌బ్రిటీలు బ్ర‌తికి ఉన్నా వారిని చంపేసి వార్త‌లు రాశారు. దీంతో వారంత‌ట వారే మీడియా ముందుకు వ‌చ్చి నేనే బ్ర‌తికే ఉన్నాన‌ని చెప్పుకోవ‌ల‌సి వ‌చ్చింది. తాజాగా ప్ర‌ముఖ క‌మెడీయ‌న్ సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారని, ఓ వెబ్‌సైట్ త‌ప్పుడు వార్త‌ని ప్ర‌చురించింది. దీంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అభిమానులు ఆందోళ‌న చెందారు. సునీల్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదం గురి కావ‌డంతో ఆయ‌న కారు నుజ్జు నుజ్జు అయింద‌ని, సునీల్‌ని క‌డ‌సారి చూసేందుకు ప్ర‌ముఖులు ఆయ‌న ఇంటికి వెళుతున్నార‌ని ఆ వార్త‌లో తెలిపారు. దీనిపై సునీల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

నేను ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో ఎలాంటి వాస్త‌వం లేదు. అది పూర్తిగా త‌ప్పుడు వార్త‌. ఏదో వెబ్‌సైట్ త‌మ వ్యూస్ పెంచుకోవ‌డానికి ఇలాంటి నీచ‌మైన ప‌నిచేసింది. మీరెవ‌రు ఆందోళ‌న చెందొద్దు. మీ ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను అని సునీల్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రాసి అంద‌రిని ఆందోళ‌న‌కి గురి చేసిన స‌ద‌రు వెబ్‌సైట్‌పై చర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్స్ కోరుతున్నారు. సునీల్ ప్ర‌స్తుతం క‌మెడీయ‌న్‌గా ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.





3977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles