అఫీషియ‌ల్‌: హిందీలో రీమేక్ కానున్న 'ఎఫ్‌2'

Fri,March 29, 2019 11:33 AM
F2 To Be Remade In Hindi Soon

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి కామిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్‌2 చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన కామెడీ ఎంటర్టైన‌ర్ ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచింది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు చిత్రంలో క‌థానాయికలుగా న‌టించి త‌మ గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతంకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ తో ప్రేక్షకుల కడుపు చెక్కలు అయ్యేలా చేశాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. బోనిక‌పూర్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని అనీస్ బ‌జ్మీ తెర‌కెక్కించ‌నున్నాడు. మ‌రి చిత్రంలో ప్ర‌ధాన పాత్ర ధారులుగా ఎవరు న‌టిస్తార‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.


1835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles