బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న 'ఎఫ్‌2'

Sun,February 24, 2019 07:21 AM

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన కామెడీ ఎంటర్టైన‌ర్ ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ని రాబ‌డుతుంది. తాజాగా ఈ చిత్రం రూ. 140కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచింది. సౌత్ ఇండియాలో 140 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మ‌ల్టీ స్టార‌ర్ మూవీగాను ఈ చిత్రం నిలిచింది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు చిత్రంలో క‌థానాయికలుగా న‌టించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల ఇప్ప‌టికి థియేట‌ర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయంటే ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది. చాలా ఏళ్ల తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఉన్న సినిమాలో నటించి ప్రేక్షకుల కడుపు చెక్కలు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అనసూయ, హరితేజ, సుబ్బరాజు, రఘబాబు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, అన్నపూర్ణ, హరితేజ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి సందడి చేశారు.

4662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles