వంద కోట్ల క్ల‌బ్‌లో ఎఫ్ 2..ధ‌న్య‌వాదాలు తెలిపిన చిత్ర బృందం

Fri,January 25, 2019 11:42 AM

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్ 2 సంక్రాంతి కానుకగా విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ నిల‌క‌డ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూ తాజాగా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్... మా సినిమా ని ఇంత ఘనవిజయం చేసిన తెలుగు అభిమానులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. కేవ‌లం రెండు వారాల‌లోనే ఈ సినిమా వంద కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిందంటే ఎఫ్ 2 చిత్రాన్ని జ‌నాలు ఎంత‌గా ఆద‌రించారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఓవ‌ర్సీస్‌లోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో వెంకీకి తోడ‌ల్లుడిగా అద‌ర‌గొట్టాడు. ఇక వెంక‌టేశ్ అయితే నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత త‌నలోని కామెడీ యాంగిల్‌ని ప్రేక్ష‌కుల‌కి మ‌రోసారి చూపించాడు. అంతేగా అంతేగా అంటూ.. హీరోలిద్దరూ చేసే మేనరిజం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. చిత్రం చూసిన పెళ్ళైన మ‌గాళ్ళు, ఆడ‌వాళ్ళు స్టోరీలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప‌గ‌ల‌బ‌డి నవ్వుకున్నారు. వ‌చ్చే సంక్రాంతికి ఎఫ్ 2కి సీక్వెల్ చిత్రం రానుంద‌నే సంగ‌తి తెలిసిందే.
2938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles