జర్నీ ఆఫ్ ఎఫ్2.. మేకింగ్ వీడియో

Fri,January 11, 2019 11:15 PM
f2 movie making video

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ హ‌వా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్న అనిల్ రావిపూడి.. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తాజాగా ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) అనే కామెడీ ఎంటర్‌టైన‌ర్ తెర‌కెక్కించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ నిరూపించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. మేకింగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది.. సినిమా యూనిట్ ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమాను తీసిందో. ఇంకెందుకు ఆలస్యం.. ఎఫ్2 మేకింగ్ వీడియోను చూసేయండి.

1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles