ఎఫ్‌2 నుండి మ‌రో డిలీటెడ్ సీన్

Tue,March 12, 2019 08:26 AM

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఎఫ్ 2. వినోద‌భ‌రిత చిత్రంగా తెర‌కెక్కి ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్వించిన ఈ చిత్రంకి సంబంధించి కొన్ని డిలీటెడ్ సీన్స్‌ని మేక‌ర్స్ ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ప్ర‌కాశ్ రాజ్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తామ‌ని వెంకీ, వ‌రుణ్‌లు ఆయ‌న ఇంట్లోకి అడుగ‌పెట్టి, ప్ర‌కాశ్ రాజ్ బాల్యం కి సంబంధించిన స‌న్నివేశాల‌ని వివ‌రిస్తూ ఉండే వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియోకి కూడా చాలా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు చిత్రంలో క‌థానాయికలుగా న‌టించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 106 సెంట‌ర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని అనీల్ రావిపూడి ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. సీక్వెల్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు.


5109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles