ఎఫ్ 2 డిలీటెడ్ సీన్ వీడియో

Fri,March 8, 2019 08:29 AM

వినోద‌భ‌రిత చిత్రంగా తెర‌కెక్కి ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్వించిన చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ ఉప‌శీర్షిక‌. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ని రాబ‌డుతుంది. సౌత్ ఇండియాలో 140 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు చిత్రంలో క‌థానాయికలుగా న‌టించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల 106 సెంట‌ర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన ఓ సీన్‌ను నిర్మాత దిల్ రాజు తన ‘యూట్యూబ్’లో విడుదల చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. ఇందులో మెహ్రీన్, వెంకటేష్, త‌మన్నా మధ్య వచ్చే సన్నివేశం భలే సరదాగా ఉంది. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.


3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles