యూఎస్‌లోను బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్

Sun,January 27, 2019 10:39 AM
F2 crosses 2 Million dollars in USA

ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బడా హిట్ కొట్టిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్ 2( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్‌లో వెంకీకి తోడ‌ల్లుడిగా అద‌ర‌గొట్టాడు. ఇక వెంక‌టేశ్ అయితే నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత త‌నలోని కామెడీ యాంగిల్‌ని ప్రేక్ష‌కుల‌కి మ‌రోసారి చూపించాడు. అంతేగా అంతేగా అంటూ.. హీరోలిద్దరూ చేసే మేనరిజం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. చిత్రం చూసిన పెళ్ళైన మ‌గాళ్ళు, ఆడ‌వాళ్ళు స్టోరీలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప‌గ‌ల‌బ‌డి నవ్వుకున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్ లోకి కూడా చేరింది. అయితే ఈ చిత్రంకి యూఎస్‌లోను మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అతి త‌క్కువ టైంలోనే 2 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది ఈ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే అత్యధిక లాభాలను తీసుకువచ్చిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. తమన్నా ,మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.య అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రానికి వ‌చ్చే ఏడాది సీక్వెల్ కూడా రానుంద‌ని అంటున్నారు.

3204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles