మహేష్ మూవీకి యాడెడ్ ఎట్రాక్షన్

Thu,April 26, 2018 04:31 PM
extra scenes added to bharat ane nenu

ఒక్కోసారి షూటింగ్ లో ఎక్కువ సీన్స్ తీసినా, షాట్స్ తీసినా ... ఎడిటింగ్ లో వాటిని కట్ చేసి, సినిమాను ట్రిమ్ చేయడం సహజం. సినిమాలో స్పీడ్ కోసం కానీ, లేదంటే నిడివి పెరుగుతుందని భావిస్తే పర్టిక్యులర్ సీన్స్ తొలగిస్తారు. కాని సినిమా రిలీజైన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ను బట్టి .. ఆ తీసేసిన సీన్స్ ను యాడ్ చేయడం మామూలే. అలా కొన్ని సినిమాలకు జరిగింది కూడా. ఇప్పుడు భరత్ అనే నేను మూవీకి కూడా అదే జరిగింది.

మహేశ్ హీరోగా .. కొరటాల శివ డైరెక్షన్ లో రిలీజైన 'భరత్ అనే నేను' సినిమా విడుదలైన ప్రతి చోటా హై రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉండటంతో, ఫైనల్ ఎడిటింగ్ సమయంలో తాను తొలగించిన సన్నివేశాలను తిరిగి కలపబోతున్నట్టు కొరటాల శివ తెలిపాడు. ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి ఎక్కువవుతుందేమోనని కొన్ని మంచి సీన్స్ ను తొలగించవలసి వచ్చింది. ఆ సన్నివేశాలను త్వరలో కలప బోతున్నామని కొరటాల చెప్పాడు. త్వరలో కలపబోయే ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పించడం ప్రారంభించినట్టు సమాచారం.

2648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles