బిగ్ బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించిన ఇద్ద‌రు ఎవ‌రో తెలుసా?

Sat,September 21, 2019 08:20 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 61లో ప‌ది మంది ఇంటి స‌భ్యుల‌కి సంబంధించిన ఆత్మీయులని యాక్టివిటీ ఏరియాలోకి పంపిన సంగ‌తి తెలిసిందే. వారులో తొలి ఐదుగురు మాత్ర‌మే నెక్ట్స్ రౌండ్‌కి వెళతార‌ని ఆ త‌ర్వాత ఇద్ద‌రికి మాత్ర‌మే ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ ద‌క్కుతుంద‌ని బిగ్ బాస్ చెబుతాడు. మొద‌టి రౌండ్‌లో బిగ్ బాస్ క‌న్ను వితికా, శివ‌జ్యోతి, ర‌వి, పున‌ర్న‌వి, హిమ‌జ కుటుంబ స‌భ్యుల‌కి రావ‌డంతో వాళ్ళు రెండో రౌండ్‌కి వెళ్ళే అర్హ‌త సాధించారు.


రెండో రౌండ్‌లో ఐదుగురు కుటుంబ‌ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్‌కి బిగ్ బాస్ సాటిస్ఫై కాక‌పోవ‌డంతో మ‌ళ్లీ అదృష్టాన్నే ప‌రీక్షించుకోమ‌ని చెప్పారు. ఐదుగురికి ఐదు బాక్స్‌లు ఇచ్చి ఒక్కొక్క‌రిని ఒక్కోసారి ఓపెన్ చేయ‌మ‌ని చెప్పారు. ఈ రౌండ్‌లో ర‌వికృష్ణ మావయ్య‌, వితికా అన్న‌య్య‌కి అదృష్టాన్ని వ‌రించింది. దీంతో వారిరివురు క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్ళి త‌మ ఆత్మీయుల‌ని క‌లుసుకున్నారు. గేమ్ బాగా ఆడుతున్నారు, ఇంట్లో అంద‌రు బాగా ఉన్నారు. మంచి గేమ్ ఆడి టైటిల్ తీసుకొని రావాల‌ని ర‌వికృష్ణ‌, వితికాకి వాళ్ళ మ‌ద్ద‌తుదారులు చెప్పారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో శ్రీముఖి గుక్క ప‌ట్టి ఏడ‌వడంతో ఆమె అభిమానులు కూడా ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న త‌మ్ముడిని చూడ‌గానే శ్రీముఖి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఆమె ఇంత‌గా ఏడ్చే స‌రికి ప్రేక్ష‌కుల‌కి కూడా క‌ళ్ళు చెమ‌ర్చాయి. శివ‌జ్యోతి కూడా త‌న అన్న‌ని చూసే స‌రికి గుక్క‌ప‌ట్టి ఏడ్చింది. వారిని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు ఇంటి స‌భ్యులు. గ‌త సీజ‌న్స్‌లో హౌజ్‌మేట్స్ కుటుంబ‌స‌భ్యుల‌ని డైరెక్ట్‌గా ఇంటిలోకి పంపిన బిగ్ బాస్ ఈ సారి మాత్రం కొంత ట్విస్ట్ ఇచ్చి వారిని తెగ ఏడిపించాడు.

ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి స‌ర‌దా టాస్క్ ఇచ్చారు. ఇందులో మ‌గ‌వారు, ఆడ‌వారు రెండు గ్రూపులుగా ఏర్ప‌డాలి. మొద‌టి రౌండ్‌లో మగ‌వారు ఎమోష‌నల్ అయి ఏడ‌వ‌డం, ఆడ‌వారు తొంద‌ర‌గా ముస్తాబు కావాల్సి ఉంటుంది. కాని మ‌గ‌వారు ఎవరు ఏడ‌వ‌లేదు. ఆడ‌వారు మాత్రం ప‌ది నిమిషాల‌లో ముస్తాబు అయి వ‌చ్చారు. ఇక త‌ర్వాత మ‌గ‌వారు బెడ్ రూం స‌ర్ధ‌డం, ఐదు ఆమ్లెట్స్ వేయాలి. ఇది స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు... ఆడ‌వారిని ప‌ది జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ ప్ర‌శ్న‌లు వేయ‌గా ఇందులో కొన్నింటికి మాత్ర‌మే స‌మాధానం చెప్పారు. దీంతో ఈ లెవ‌ల్‌లో ఆడవారు ఓడిపోయారు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎవ‌రు సేఫ్ అవుతార‌నే విష‌యంపై నాగార్జున ఓ క్లారిటీ ఇవ్వ‌నున్నారు.

4756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles