మ‌హ‌ర్షి 'ఎవ‌రెస్ట్ అంచున..' ఫుల్ వీడియో సాంగ్

Tue,July 2, 2019 09:07 AM
Everest Anchuna Full Video Song released

వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, పూజా హెగ్డే, అల్ల‌రి నరేష్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రం జూన్ 27తో 200 థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా 50 రోజుల వేడుక‌ని జ‌ర‌పాల‌ని టీం భావించ‌గా, విజ‌య నిర్మ‌ల హ‌ఠాన్మ‌ర‌ణంతో వేడుక‌ని వాయిదా వేశారు. మ‌హర్షి చిత్రం ఇప్ప‌టికి ప‌లు థియేట‌ర్స్‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. మూవీకి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ఎవ‌రెస్ట్ అంచున‌.. అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేశారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ పాట‌కి శ్రీమ‌ణి లిరిక్స్ అందించారు. హేమ‌చంద్ర‌, విష్ణు ప్రియ ర‌వి ఆల‌పించారు. ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు .

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles