ఆమెతో ప్రేమలో పడ్డాక నీళ్లు కూడా షర్బత్‌లా అనిపిస్తున్నాయి!

Thu,June 21, 2018 03:22 PM
Even water tastes like Sherbat when you are in love says Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కొత్తగా మరో ప్రేమాయణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే కదా. నటి ఆలియా భట్‌తో అతను ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అతను పబ్లిగ్గా చెప్పేశాడు. తాజాగా అనుపమా చోప్రాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు తరచూ ప్రేమలో పడుతుంటారు.. ఇదేమైనా మీ కెరీర్‌పై ప్రభావం చూపుతుందా అని ఆమె ప్రశ్నించారు. దీనిపై రణ్‌బీర్ నవ్వుతూ స్పందించాడు. అసలు ప్రేమలో పడటం చాలా గొప్ప విషయం. మనం ప్రేమలో ఉన్నపుడు అన్నీ ఎంతో గొప్పగా కనిపిస్తాయి.

నీళ్లు కూడా షర్బత్‌లా అనిపిస్తాయి. అసలు ప్రేమలో పడొద్దు అనుకునే వాళ్లు ఎవరుంటారు అని రణ్‌బీర్ అన్నాడు. ప్రేమలో పడిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని అతడు చెప్పాడు. బ్రహ్మాస్త్ర అనే మూవీలో రణ్‌బీర్, ఆలియా కలిసి నటిస్తున్నారు. అంతకుముందే రణ్‌బీర్ లీడ్ రోల్‌లో నటించిన సంజూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. జూన్ 29న విడుదల కానుంది.


4308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles