‘సాహో’లో ఇండో జర్మన్ నటి నెగెటివ్ రోల్..?

Mon,March 18, 2019 04:13 PM
Evelyn Sharma to plays negative role in Saaho ?


సుజిత్, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం సాహో. శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన స్టిల్స్, మేకింగ్ వీడియోలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇండో జర్మన్ నటి ఎవ్‌లిన్ శర్మ సాహోలో నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌తో కలిసి భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించింది ఎవ్‌లిన్ శర్మ. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవ్‌లిన్ శర్మ మాట్లాడుతూ..ప్రభాస్‌లాంటి జెంటిల్‌మెన్‌తో షూటింగ్ చేసేటపుడు చాలా ఎంజాయ్ చేశానని, ప్రభాస్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. సాహో చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, తమిళ నటుడు అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

1611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles