క‌ల్కి నుండి ఎవరో ఎవ‌రో మెలోడీ సాంగ్ విడుద‌ల‌

Sun,June 23, 2019 12:24 PM
Evaro Evaro Lyrical video from Kalki Movie

గరుడవేగ చిత్రం త‌ర్వాత రాజశేఖర్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కల్కి . ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా పూర్తి బాధ్య‌త‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ మోస్తున్నాడు. 'అ!' త‌ర్వాత త‌నకొక మంచి హిట్ వ‌స్తుంద‌ని వ‌స్తుంద‌ని ప్ర‌శాంత్ అభిప్రాయ ప‌డుతున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. జూన్ 28న చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి ప‌లు వీడియోలు విడుద‌ల చేస్తూ సినిమాపై ఆస‌క్తి పెంచుతున్నారు. తాజాగా ఎవ‌రో ఎవ‌రో అనే మెలోడీ సాంగ్ విడుద‌ల చేశారు. హేమ‌చంద్ర‌, స్వాతిమోహ‌న్ ఆల‌పించిన ఈ పాట‌కి కృష్ణ‌కాంత్ లిరిక్స్ అందించారు. శ‌ర్వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందించారు. చిత్రంలో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత.

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles