చెర్రీతో చిందేయ‌నున్న బాలీవుడ్ భామ‌

Thu,December 13, 2018 11:41 AM
Esha Gupta to sizzle in Vinaya Vidheya Rama

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విన‌య విధేయ రామ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మాస్‌ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు.

ఈ సినిమాకి మ‌రింత క్రేజ్ తీసుకొచ్చేందుకు గాను ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం ఇలియానాని తీసుకోవాల‌ని టీం భావించిందట‌. ఇందుకోసం ఇలియానాని సంప్ర‌దిస్తే ఒక్క‌పాట‌కి ఇలియానా అడిగిన పారితోషికం 60 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. దీంతో ఖంగుతిన్న నిర్మాత‌లు మ‌రో ఆలోచ‌న చేసారు. బాలీవుడ్ భామ ఇషా గుప్తాని స్ఫెష‌ల్ సాంగ్ కోసం ఎంపిక చేశారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన పబ్ సెట్ ను నిర్మిస్తున్నారు. రేపటి నుండి ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ చిత్రీకరణలో చరణ్ ,ఇషా తో కలిసి స్టెప్పులు వేయనున్నారు. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం.

2334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles