రెండోసారి ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన ఈషా డియోల్

Tue,June 11, 2019 11:20 AM
Esha Deol And Bharat Takhtani Name Their Daughter Miraya

బాలీవుడ్ న‌టి ఈషా డియోల్ మ‌రోసారి బేబి గార్ల్‌కి జ‌న్మ‌నిచ్చింది. ఈషా, భ‌ర‌త్‌ త‌క్తానీలు 2012లో ఏడ‌డుగులు వేయ‌గా, ఈ దంప‌తుల‌కి రాధ్య అక్టోబ‌ర్ 2017లో జ‌న్మించింది. మంగ‌ళ‌వారం రెండో కాన్పు కింద త‌న‌కి ఆడ‌బిడ్డ జ‌న్మించింద‌ని ఇషా డియోల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. మీ ప్రేమ‌, ఆశీర్వాదానికి ధ‌న్య‌వాదాలు అని ఇషా తన పోస్ట్‌లో పేర్కొంది. పెళ్ళి త‌ర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాల‌కి దూర‌మైంది. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి డెబ్యూ ఇచ్చింది ఈషా డియోల్‌. హేమ మాలిని, ధ‌ర్మేంద్ర‌ల పెద్ద కూతురు ఈషా కాగా, చిన్న కూతురు అహానా. ఈషా, అహానాలు మంచి క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్స్ అన్న సంగ‌తి తెలిసిందే. ధూమ్, యువ‌, నో ఎంట్రీ, ధ‌స్ చిత్రాల‌తో ఈషా బాగా పాపుల‌ర్ అయింది ఈషా. త‌న‌కి మ‌రో కూతురు జ‌న్మించ‌డంతో హేమమాల‌ని దంప‌తులు సంతోషంగా ఉన్నార‌ని ఈషా పేర్కొన్నారు.

3746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles