బిచ్చ‌గాడు డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎరుపు ప‌సుపు ప‌చ్చ‌'

Sat,August 10, 2019 12:09 PM
Erupu Pasupu Pachha first look released

విజయ్ ఆంటోనీతో ‘పిచైకారన్’ (తెలుగులో ‘బిచ్చగాడు’) సినిమాని రూపొందించి అందర్నీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు శ‌శి. ఆ సినిమాకి పూర్తి భిన్నంగా రొమాంటిక్ కామెడీగా ‘శివప్పు మంజల్ పచై’ని అతను తీర్చిదిద్దుతున్నాడు. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోలుగా తమిళంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్ చేతుల మీదుగా విడుద‌ల అయింది. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సిద్ధార్థ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, జీవీ ప్ర‌కాశ్ స్ట్రీట్ రేస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది .ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్ జోడీగా మలయాళీ తార లిజోమోల్ జోస్ నటిస్తుండగా, ప్రకాశ్ సరసన నాయికగా నూతన తార కశ్మీరా కనిపించనున్నది. ఈ సినిమా ద్వారా సిద్ధుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ బేనర్‌పై రాజేశ్ పి. పిళ్లై నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. అయితే తెలుగులోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుండగా, తాజాగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఎరుపు ప‌సుపు ప‌చ్చ అనే టైటిల్‌తో తెలుగులో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ ప‌తాకంపై ర‌మేష్ పిళ్లై విడుద‌ల చేస్తున్నారు

1747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles