'ఎంతో ఫ‌న్' లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

Wed,December 26, 2018 01:32 PM

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నమాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. సంక్రాంతికి(జ‌న‌వ‌రి 12న‌) విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే లిరిక‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. దేవి శ్రీ ప్ర‌సాద్ పాడిన ఈ పాట సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. మీరు ఈ సాంగ్ విని ఆనందించండి.

2285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles