త‌మ‌న్నా, వెంకీల రొమాంటిక్ వీడియా సాంగ్

Sat,February 9, 2019 01:06 PM
Entho Fun Full Video Song released

విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్’ అనేది ట్యాగ్‌లైన్‌. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు . వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించారు. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం త‌క్కువ టైంలోనే వంద కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. తాజాగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే సాంగ్ ఫుల్‌ వీడియోని విడుద‌ల చేశారు. ఈ పాటలో వెంకీ, త‌మ‌న్నా కెమిస్ట్రీ బాగుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఫ‌న్ రైడర్‌ను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు.

3271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles