కాజల్ సినిమాకు మోక్షం లభించింది

Tue,March 21, 2017 12:48 PM
Enthavaraku Ee Prema movie release date fixed

కలువ కళ్ళ సుందరి కాజల్.. ఇటీవల నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజిత్ మూవీ వివేగం తో పాటు నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేస్తుంది. అయితే రంగం వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా సరసన హీరోయిన్ గా జతకట్టింది కాజల్ . ‘కావలై వేండమ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కగా తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ పేరుతో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ‘యామిరుక్క బ‌య‌మేన్‌’ ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందింది. నవంబర్ 24న తమిళ వర్షెన్ ని విడుదల చేసిన టీం ఇప్పటి వరకు తెలుగు వర్షెన్ మూవీని విడుదల చేయకపోవడం గమనర్హం. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. డీవీ సిని క్రియేషన్స్ బేనర్ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురానుండగా లియోన్ జేమ్స్ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి 31న తెలుగు వర్షెన్ ని అంతటా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

1592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles