రంగస్థలం నుంచి ‘ఎంత సక్కగున్నావే లచిమి’ పాట..

Tue,February 13, 2018 05:37 PM
Entha Sakkagunnave song revealed from rangasthalam


హైదరాబాద్ : సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం. రాంచరణ్, సమంత కాంబినేషన్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ మూవీ వస్తుంది. తాజాగా రంగస్థలం నుంచి మొదటిసాంగ్ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది. చంద్రబోస్ ఈ పాటను రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. రంగస్థలం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

3582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles