శ్రీదేవి సోదరిగా నటించిన సుజాత్ కుమార్ కన్నుమూత

Mon,August 20, 2018 12:11 PM
English Vinglish actor Sujata Kumar dies in Lilavati Hospital after cancer battle

ముంబై : ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో దివంగత నటి శ్రీదేవి సోదరిగా నటించిన సుజాత కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాత.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సుజాత ఆదివారం రాత్రి 11:26 గంటలకు కన్నుమూసినట్లు ఆమె సోదరి సుచిత్ర కృష్ణమూర్తి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విల్లే పార్లేలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. సుజాత కుమార్.. గోరి తేరే ప్యార్ మేన్, రంజ్‌హనా సినిమాలతో పాటు పలు టీవీ షోలలో నటించారు.4963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS