ఇంగ్లండ్ పోలీస్ ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ ఫోటో

Wed,February 13, 2019 12:08 PM
England Police Posted Superstar Rajinikanth Image

రాష్ట్రాలు, దేశాల‌తో సంబంధం లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు అందుకుంటున్న న‌టుడు ర‌జ‌నీకాంత్‌. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు త‌లైవా. రీసెంట్‌గా 2.0, పేటా అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 2.0 చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌గా అత్య‌ద్భుత‌మైన గ్రాఫిక్స్ తో రూపొందింది. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ముఖ్యంగా వ‌సీక‌ర‌ణ్ అనే సైంటిస్ట్ పాత్ర‌లోను, చిట్టి పాత్ర‌లోను ర‌జ‌నీ ఆక‌ట్టుకున్నాడు. అయితే తాజాగా ఇంగ్లండ్ పోలీస్ త‌మ ట్విట్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్ ఉన్న‌ ఫోటోని షేర్ చేసి అంద‌రికి షాకిచ్చింది. ఓ వ్య‌క్తి మోతాదుకి మించి తాగి కారు డ్రైవింగ్ చేస్తుండ‌గా, డ‌ర్బీ పోలీసులు ఆయ‌న‌కి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇందులో రీడింగ్ ఓ రేంజ్‌కి వెళ్ళ‌డంతో సైంటిస్ట్‌లు కూడా షాక్ అవుతున్నార‌నేలా ర‌జ‌నీకాంత్ ఫోటోని వాడిన‌ట్టు తెలుస్తుంది. ఫోటోపై ఇది సైన్స్ కి కూడా అంతుబ‌ట్ట‌కుండా ఉంది అనే కామెంట్ కూడా రాసారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుంది.



3292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles