సంగీత్ కోసం ఇట‌లీ చేరుకున్న బాలీవుడ్ సింగ‌ర్స్

Tue,November 13, 2018 10:55 AM
Energetic Bollywood Singers To Perform At The Sangeet

ఆరేళ్ళుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న దీపికా, రణ్‌వీర్‌లు నవంబర్ 14, 15 తేదీల్లో జ‌ర‌గ‌నున్న వివాహంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. ఇట‌లీలోని లేక్ కోమో వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఈ నెల 14న కొంకణీ సంప్రదాయంలో, 15న సింధీ సంప్రదాయంలో రణ్‌వీర్‌-దీపిక పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. పెళ్లి వేడుకలు వారి జీవితంలో మ‌రచిపోలేని విధంగా ఉండేలా వెడ్డింగ్ ప్లాన‌ర్స్ ఏర్పాటు చేస్తున్నారు. నేడు( నవంబర్ 13) సంగీత్ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం కోసం బాలీవుడ్ సింగ‌ర్స్ ఇప్ప‌టికే ఇట‌లీ చేరుకున్నారు. బాలీవుడ్ ఫేమ‌స్ సింగ‌ర్ హ‌ర్ష‌దీప్ కౌర్ త‌న కో సింగ‌ర్స్‌, మ్యుజీషియ‌న్స్ సంజయ్ దాస్, బాబి ప‌త‌క్, ఫిరోజ్ ఖాన్ మిల‌న్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. హ‌ర్ష‌దీప్ .. దీపిక‌ న‌టించిన హే జ‌వానీ హే దీవానీ చిత్రంలో క‌బీరా అనే సాంగ్‌తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న బెంగ‌ళూరులో, డిసెంబర్ 11న ముంబైలోని హయత్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందని టాక్. పెళ్లికి 200 మంది మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. వివాహ‌మైన మూడు రోజుల త‌ర్వాత నూత‌న దంప‌తులు ఇండియాకి వ‌స్తార‌ని అంటున్నారు. ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది దీపిక .

1518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS